Wednesday 8 July 2015

పర్ణసాల - A telugu novel

నేను పూర్తిగా చదివిన మొట్టమొదటి తెలుగు నవల.
తెలుగు సాహిత్యం పట్ల ఇతివరకెన్నడూ ఊహించని ఆసక్తిని పెంపొందించిన నవల.
జీవితం అందించే ఎన్నో పాఠాలలో ఒక పాఠాన్ని కళ్ళకు కట్టినట్టు ఒక ప్రయాణంలా పరిచయం చేసిన నవల.

The story revolves around money.
How important or unimportant it is when related to happiness?

కథ ప్రారంభంలొ ఇద్దరు వ్యక్తులమధ్య వాదులాట జరుగుతూ ఉంటుంది -
ఒకరేమో డబ్బు ఉంటేనే ప్రేమానురాగాలు ఉంటాయి అనీ, మరొకరేమో డబ్బుకీ వాటికీ సంబంధమే లెదనీ, ప్రేమానురాగాలు డబ్బు అనే కాగితాలతొముడిపడి ఉండవనీ.

కథలొ, డబ్బు ఉంటేనే ప్రేమ ఉంటుంది అనేవారికి జీవితంలొ వారు చూడనంత డబ్బు ఒక్కసారిగా నటింట్లొ తాండవం చేస్తుంది, కానీ అది ప్రేమానురాగాలని తనవెంట తీస్కురాకపోగా - ఉన్న ప్రేమని ప్రేమతొ ప్రేమగా ప్రేమించనివ్వదు.

డబ్బు తొ ప్రేమానురాగాలు ముడిపడి  ఉండవు  అన్న వారికి ఉన్న డబ్బు అంతా పోతుంది, దానితొపాటే జీవితంలొ ప్రస్తుతం ఉన్న ప్రేమానురాగాలు కూడా దబ్బు లేక కొన్ని, దబ్బు కోసం కొన్ని, బంధాలు బాంధవ్యాలు తెంచుకుని వెల్లిపోతాయి.
ఒక చాలా సంక్లిష్టమైన ప్రయాణం తర్వాత తిరిగి ఆ ఇద్దరూ మళ్ళి కలిసినప్పుడు, ఒకరి అభిప్రాయం ఒకరు తప్పు అని, వారి వారి అనుభవ పూర్వక జ్ఞానంతొ తిరిగి సంభాషించుకుంటారు.


ఇంతకీ డబ్బు ప్రేమానురాగాలని తెస్తుందా?
అవి రెండూ ముడిపడి ఉంటాయా?
డబ్బు గొప్పదా?
సంతోషం గొప్పదా?
డబ్బు సంతోషాన్ని తెస్తుందా?
పోనీ, సంతోషం డబ్బుని కొనగలదా?

సంతోషంగా ఉండటానికి డబ్బు కావాలా?
ఎంత కావాలి?
డబ్బుతొసంతోషం వస్తుందా? 
ఒస్తె, ఎంత సంతోషం వస్తుందీ?

డబ్బు అవసరాన్ని బట్టి కావాలి. 

మన అవసరాలేంటి? 
దానికి ఎంత కావాలి?
అది సంపాదించడానికి ఎంత కష్టపడాలి?
ఎలా కష్టపడాలి?

ఇవీ! మనం తెలుసుకోవలసినవి.

అసలు డబ్బు అనేదే లేకపోతే -  కొపం, చిరాకు, అసహనం ప్రేమానురాగాల స్థానాన్ని భర్తీ చేస్తాయి.
ఎక్కువ ఉంటే, ఎలా దన్ని భధ్రపరుచుకోవాలో అన్న ఆందోళనలోనె సమయం ఖర్చు ఐపోతుంది.

మరి ఎంత కావాలి? మనకి ఎంత అవసరమో, దానికంటే కాస్త ఎక్కువ - రేపు థుఫాను వస్తే భయపడకుండా ఎదుర్కోగలిగేంత, ఈరోజు సంతోషంగా ఎలాంటి బాధలబంధీ లేకుండా గడపగలిగేంత.
సంతోషం - డబ్బు, ఇవి రెండు ట్విన్స్.
ఏది తక్కువైనా, ఏది మితిమీరినా, జీవితం అస్తవ్యస్తం అవుతుంది.

ఎలా అంటారా?

చెట్టు పెరగటానికి, ఎండ ఎంత ముఖ్యమో నీరూ అంతే ముఖ్యం కదా?
రాగం, తాళం, ష్రుతి, లయ - అన్నిటి కలయికేగా సంగీతం? 

ఏది హద్దుదాటినా, ఏది కరువైనా - మొక్క ఎండిపోతుందీ, సంగీతం కరతాల ధ్వనిగా మారిపోతుంది. :)